ఈ సీజన్ లో ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య పాదాల పగుళ్ళు. పాదాల మామాల్లో నూనె గ్రంధులు వుండవు. ఇవి దుమ్ము ధూళికి నిరంతరం ఎక్స్ పోజ్ అవ్వుతాయి. అందుకే పాదాల పగుళ్ళు వస్తాయి. ప్రతి రోజు పాదాలకు కొబ్బరి నూనె, కోకా బటర్ గల మాయిశ్చురైకింగ్ క్రీమ్స్ రాస్తూ ఉంటేనే పాదాలు మృదువుగా ఉంటాయి. ఫ్యుమిక్ స్టోన్ తో స్క్రబ్ చేయాలి. ప్రతి రోజు టబ్లో గోరు వెచ్చని నీటిలో కొద్ది చుక్కలు నిమ్మరసం, లేదా క్లెన్సింగ్ లోషన్ వేసి పాదాలు అందులో మునిగేలా ఉంచాలి. దీని వాళ్ళ పాదాల అలసట పోతుంది. ఫ్యుమిక్ స్టన్ తో రుద్దితే మ్రుతకనాలు పోతాయి. మాయిశ్చురైజింగ్ ఫుట్ క్రీమ్స్ అప్లయ్ చేసి రాత్రి వేళ సాక్స్ వేసుకుని పడుకుంటే ఉదయానికి పాదాలు తేమ తో మెత్తగా కనబడతాయి.

Leave a comment