సోరయా షాహిదీ ఆఫ్ఘనిస్తాన్ టాటూ కళాకారిణి.తొలి మహిళ కూడా. విదేశాల్లో తన టాటూ కళ్ళతో గుర్తింపు పొందిన సోరయా ఇప్పుడు  కాబూల్ లో మొబైల్ టాటూ పార్లర్ నడుపుతుంది. కాబూల్ యూనివర్సిటీ లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చదివిన సోరయా సరదాగా నేర్చుకున్న టాటూ ఆమెకు జీవనోపాధి అయ్యింది. ఆఫ్ఘనిస్తాన్ లో మతచారాలు ప్రకారం ఈ టాటూ ని వ్యతిరేకిస్తున్నారు కొందరు మత  పెద్దలు కానీ సోరయా మాత్రం ధైర్యంగా తనకు వచ్చిన పని లో ఉంది .అమ్మాయిలు పువ్వులు, సీతాకోకచిలుకలు ఇష్టమైన వారి పేర్లు టాటూ లుగా వేయించుకొంటారు. యువత నుంచి  నాకు మంచి ఆధారనే ఉంది. కానీ ఈ వృత్తిలో ఈ ప్రాంతంలో నిలబడేందుకు మాత్రం ఎంతో ధైర్యం కావాలి అంటుంది సోరయా.

Leave a comment