మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో మహిళలపై జరిగే రకరకాల అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు గాను ఏర్పాటు చేసిన గ్రూప్ ‘స్పెషల్ 40’ ఈ గ్రూప్ లో ఉన్న మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన వాళ్ళు కాదు. ఎవరికీ ఏ సమస్య వచ్చినా చలించిపోయి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయగల వాళ్ళు. ఈ గ్రూప్ లో సభ్యులకు కరాటే, టైక్వాండో వంటి ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు న్యాయం,చట్టం సంబంధిత విషయాలపై అవగాహన కల్పిస్తారు. గ్రూప్ లో ఇరవై ఏళ్ళ వయసు నుంచి 60 ఏళ్ల వయసు వాళ్ళు ఉన్నారు. ఈ స్పెషల్ 40 గ్రూప్ ల దగ్గర వాకి టాకీ లు ఉంటాయి.

Leave a comment