చూసిన ప్రతి వస్తువు తమకు కావాలని కోరుకుంటారు. వెంటనే కొని ఇవ్వమని మారాం చేస్తారు. కానీ పిల్లలకు అలా కొనేసి వెంటనే చేతిలో పెట్టకండి .కష్టపడి పని చేస్తేనే కోరుకున్న వస్తువు చేతిలో పడుతుంది అన్న ఆలోచన వాళ్ళ మనసులో కలిగేలా చేయండి అంటారు చైల్డ్ సైకాలజిస్ట్ లు.మంచి మార్కులు తెచ్చుకుంటే చిన్నచిన్న పనుల్లో సాయం చేస్తే గిఫ్ట్ గా ఏదైనా ఇచ్చినా అది కూడా కష్టానికి తగిన ఫలితం లాగే ఉంటుంది. పిల్లలకు కష్టపడే తత్వాన్ని అలవాటు చేస్తే వాళ్ల భవిష్యత్తుకు ఉపయోగం.వాళ్లకు ఇచ్చే పాకెట్ మనీ జాగ్రత్తగా పొదుపు చేసుకోమని, ఆ డబ్బుతో వాళ్లకు కావలసిన వస్తువులు కొనుక్కోమని  అలవాటు చేస్తే డబ్బు పొదుపు చేయటం,ఆ డబ్బుతో కోరిన వస్తూ సొంతం చేసుకోవటం చేతనవుతుంది.పిల్లలకు లైఫ్ స్కిల్స్ నేర్పటం తో పెద్దవాళ్ళు కాస్త కఠినంగా ఉన్నపర్లేదు అంటారు ఎక్స్పర్ట్స్.

Leave a comment