అల్లం ముక్కలు, జీడి పప్పు, నెయ్యి కలిపి ఉప్మా వందేసి, నిమిషాల పైన అతిధులకు వడ్డించి, ఇలా తిరిగే సరికి అల్లం పొడితో అన్ని రకాల వైద్యులు చేయండి అని లిస్ట్ వేస్తె ఎలా వుంటుంది. వెల్లుల్లి అల్లం దంచి వంకాయ కూర వండాలా? ఎండబెట్టి పొడి చేసి ఆ చరణంతో వంటింటి వైద్యం చేయాలి అంటే ముందు తెలుసుకోవాలి. అల్లం పొడి రోజుకు మూడుగ్రాములు తింటే చెడు కోలెస్ట్రోల్ తగ్గిపోతుంది. బరువు తగ్గేందుకు ఉపయోగ పడుతుంది. ఇందులో జంజిరాల్, బీటాకెరోటిన్, కాపైస్సిన్, కెఫీక్ ఆమ్లం, కురుక్యుమిన్, శాలిసిలేట్, తదితర యాంటి ఇన్ ఫ్లమేటరీ, యాంటి ఆక్సిడెంట్లు అధికంగా వుండటం వల్ల అల్లం కండరాల్ల నొప్పుల్ని తగ్గిస్తుంది. 60 దాటిన మహిళలు రోజు కాస్త అల్లం రసం తీసుకుంటే జ్ఞాపక శక్తి అధికం అవుతుందని జార్జియా నిపుణులు చెపుతున్నారు. చల్లని వాతావరణంలో అల్లం టీ శారీరక ఉష్ణోగ్రతను పెంచుతుంది. అల్లం పొడి వరుసగా మూడు రోజుల పాటు ఇస్తే నొప్పి తగ్గిపోయినట్లు తేలింది. అల్లంలోని జంజిరాల్ వల్ల ఇన్ఫెక్షన్లు త్వరగా రావని తేలుతుంది.
Categories