కిచెన్ లో సర్వసాధారమైన పరిశుభ్రత పాటించక పోవటం వల్లనే 50 శాతం ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు అవుతున్నాయంటున్నారు నిపుణులు . గ్లోబల్ హైజిన్ కౌన్సిల్ తాజా సర్వే ప్రకారం వారు చేసిన హెచ్చరికల ప్రకారం ,మాములు వేడి నీటితో చేతులు కడిగితే బాక్టీరియా నశించదు. మరిగే నీళ్ళుండాలి. అది అసాధ్యం కనుక యాంటీ బాక్టీరియల్ లిక్విడ్ తో చేతులు కడుక్కోవాలి . 65 డిగ్రీల వేడి నీటితో గిన్నెల్ని బాక్టీరియా లేకుండా శుభ్రం చేయచ్చు . 80 శాతం కిచెన్ క్లీనింగ్ టవల్స్ బాక్టీరియా తో నిండి వుంటాయి. ప్రతి రోజు వాటిని వేడి నీళ్ళతో మరిగించాలి . కిచెన్ లో గ్యాస్ స్టవ్ అరుగులు,షింక్,ఫ్రిడ్జ్ లోపలిభాగం కిచెన్ కప్ బోర్డులు ఉపరితలాలు లిక్విడ్స్ లో ఎప్పటికపుడు శుభ్రం చేయాలి. డెట్టాల్,యాంటీ బాక్టీరియల్ సర్ ఫేస్ వైప్స్ తో వంటింటి కప్ బోర్డులు శుభ్రం చేస్తేనే 99 శాతం బాక్టీరియా నశిస్తుంది.
Categories