మలయాళం లో అంజలి మీనన్ నిర్మించిన సినిమా కూడె నీలగిరి కొండల్లో ఉంటున్న 15 ఏళ్ళ అబ్బాయి జోశువా కు చెల్లాయి పుట్టింది. కొద్ది రోజులకే ఆమె పుట్టుకతోనే అనారోగ్యం తో ఉందని ఊపిరి పీల్చుకోవటం కష్టమై మరణించే అవకాశం ఉందని చెపుతారు డాక్టర్లు. ఆ పాప వైద్యం కోసం ఇంట్లో అన్ని అమ్ముకొంటు,చివరికి జోశువా ను గల్ఫ్ లో పని చేసేందుకు పంపేస్తారు. ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి చెల్లెలి వైద్యానికి కుటుంబం కోసం డబ్బు పంపుతూ ఉంటాడు చెల్లెలు జెన్ని కాలేజీలో చేరే వయసు వచ్చాక ఒక రోజు చనిపోతుంది. ఆమెను చూసేందుకు వచిన జోశువా కు చనిపోయిన జెన్ని కనిపిస్తుంది తనెంతగా అన్నను ప్రేమించేదో చెపుతుంది. ఆ చెల్లెలు జోశువా జీవితాన్ని అన్ని విధాలా ఎలా కుదుటబడేలా చేసిందో పుట్టిన పాప లో చెల్లెలి ని చూసుకొని అన్నా ఎలా ఈ దుఃఖం నుంచి బయట పడ్డాడో చక్కని కథ ఇది. తప్పకుండా చూడవలసిన సినిమా.
Categories