Categories
ఫారెస్ట్ గైడ్ సుధా చంద్రన్ పర్యావరణ పరిరక్షణ కోసం సామాన్య ప్రజలు చేస్తున్న కృషికి ఇచ్చే పివి తంపీ మెమోరియల్ అవార్డ్ అందుకున్నారు. లైసెన్స్ పొందిన మొదటి ఫారెస్ట్ గైడ్ సుధా మూడు దశాబ్దాలకు పైగా తట్టెక్కాడ్ పక్షుల అభయారణ్యం తో అనుబంధం ఉన్న సుధ 300 పైగా పక్షి జాతులను గుర్తించగలదు. తట్టెక్కాడ్ లో టీ షాప్ నడిపే భర్త అకాల మరణం తర్వాత సుధా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ టీ దుకాణం నడుపుతూ పిల్లల్ని పెంచుకుంది. అలాగే పక్షుల పట్ల ప్రేమతో అభయారణ్యం తో సంబంధాలు పెట్టుకుంది శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డ్ తో సహా ఎన్నో అవార్డ్ లు తీసుకున్నది సుధా చంద్రన్.