ఈ సీజన్ లో గ్రీన్ టి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి . చురుకు దనం ఆరోగ్యం కూడా . ఒకే రకంగా తాగాలంటే బోర్ గా అనిపిస్తే కొంచెం వెరైటీ ట్రై చేయండి అంటారు ఎక్స్ పర్డ్స్ . లెమన్ గ్రాస్ ఐస్ట్ టీ చాలా బావుంటుంది అంటున్నారు . రెండు గ్రాములు లెమన్ గ్రాస్ ,టీ బ్యాగ్ ,రెండు టీ స్పూన్ లు తేనె లేదా పంచదార చాలు . టీ పొడిని నీళ్ళలో మరిగించి,అందులో తేనె పంచదార లెమన్ గ్రాస్ ఆకులూ వేయాలి చలార్చి వడకట్టి చల్లగా తాగేందుకు ఇందులో ఐస్ క్యూబ్స్ వేయాలి . ఈ లెమన్ గ్రాస్ రుచితో టీ చాలా బావుంటుంది . అలాగే టీ లో పుదీనా ఆకులు వేసి మరిగించి,తేనె పంచదార కలిపి వడకట్టి ఐస్ క్యూబ్స్ వేసి తాగచ్చు .

Leave a comment