Categories

2019 లో ముంబైలోని వెస్ట్ బాంద్రా లో మహిళా రచయితల పుస్తకాలతో మహిళల కోసమే సిస్టర్స్ లైబ్రరీ ప్రారంభించింది అక్వి థామీ. ముంబై లోని బాంబే అండర్ గ్రౌండ్ పేరుతో ఆర్టిస్ట్ కలెక్టివ్ అనే గ్రూప్ ఉంది ఈ గ్రూప్ సభ్యురాలు అక్వి థామీకి మహిళా రచయితల పుస్తకాలు ఈ రీడింగ్ స్పేస్ లో చదవటం లేదని గుర్తించింది. 2018 లో ఆమె ఫెమినిస్ట్ లైబ్రరీ తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఈ లైబ్రరీకి ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లోని మహిళలు సాయం చేస్తున్నారు విరాళాలు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ లైబ్రరీ కి పుస్తకాలు కొనే ధన సహాయం అందుతుంది.