ఇటలీలో ప్రజలు సన్నగా నాజూగ్గా ఉంటారట. దానికి కారణం వాళ్ళు ఆహారం తీసుకునే పద్దతి అంటారు ఎక్స్ పర్ట్స్. మనం తినే ఆహారంలో రకరకాల కూరలు, అన్నం, పప్పు, పులుసు ఇలా ఉంటాయి. వీటిని అన్నంతోనో, ఇంకో రావ్వతోనో కలుపుకు తినటాం. నంజుకోవడం అనేది మన అలవాటు. కానీ ఇటలీ వాళ్ళు అలా కాదు. ఆకు ఐటమ్స్ వుంటే అన్నింటినీ విడివిడిగానే తింటారట. అలా ఒకసారి ఒక ఐటెం తినడం వల్ల త్వరగా కడుపు నిండుతుంది. పరిమితంగా తిని ఆపేస్తారు. మన దేశంలో రకరకాల రుచులు కలిపి అవసరానికి మించి తినటం కనుక పొట్ట పెరుగుతుంది. అలాగే వాళ్ళకున్న మంచి అలవాటు కండరాల్లను చెక్కని రూపంలో ఉంచుకునేందుకు కండరాల్ల నొప్పులు రానివ్వరు. ఆలివ్ నూనె, కర్పూరం కలిపి శరీరం పై మర్దనా చేసుకోవడం . ఈ మర్దనా వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం ఆరోగ్యం, కండరాల్ల రూపం బావుంటాయి. అలసట లేని వ్యాయామం ఇది.
Categories