నీహరికా,

ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరికోసం వచ్చిన అద్భుతమైన రిపోర్టు. మనల్ని మనం ప్రేమించుకోకుండా శ్రద్ధ తీసుకోకుండా ఉంటేనే అన్ని రకాల ఆందోళనలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రేమించుకోవడం అంటే ముందర సుఖంగా నిద్రపోవడం ఫస్ట్. అనవసరమైన ఆందోళన, పని వత్తిడి, రేపు ఉదయపు కార్యక్రమాలు మనస్సులో నింపుకుని మంచం పైన వాలినా నిద్రెలా పడుతుంది. అలాగే ఆనందంగా వుండటం కోసం కాకుండా మనపై మనకున్న ప్రేమకు గుర్తుగా చెక్కగా అలంకరించు కోవడం. ఏ స్పాకొ, సెలూన్ కొ వెళ్ళడం చెక్కగా తీర్చిదిద్దుకోవడం ఇవీ అవసరమే. ఎలాగోలా లెద్దూ, అబ్బా ఇంత పని పెట్టుకుని అనుకొనే నిర్లక్ష్యం చేసుకోకండి అంటున్నారు. ఇది మరి మంచి పాయింటే కదా. అలాగే ఇప్పటి వరకు ఏదైతే అసాధ్యం అనుకుంటున్నామో వాటిని ప్రయత్నించి చూడటం అన్నింటికంటే ముఖ్యం . అది చిన్నదా పెద్దదా అని కాదు, మన వల్ల కాదులే అని వదిలేసేవి. కానీ ఒక్కసారి  ట్రై చేస్తే ఆ పని చేయగలిగితే…. ఎందుకు కాదో ఏపనైనా అస్సలు మన వల్ల కాకపోతే అసలు ఇంకెవరి వల్లా కాదనుకోండి. ఇంక అవన్ని అయిపోయినట్లే అంటున్నారు. అనుభవంతో చెపుతున్న విషయాలు ఆచరిస్తే పోలేదూ!

Leave a comment