మధుమేహం ఒక రకంగా నియంత్రిచుకునే అవకాశం లేని అనారోగ్యం .ఒకసారి ఈ అనారోగ్యం భారీన పడితే నిరంతరం మందులతోనే జీవించాలి . కానీ బ్రిటన్ లోని కాంబ్రిడ్జి శాస్త్రవేత్తలు ఈ అనారోగ్యం నుంచి బయట పండేందుకు ఏకైక మార్గం బరువు తగ్గించుకోవటం అని చెపుతున్నారు. మధుమేహం వచ్చిన తొలి ఐదేళ్ళలో పదిశాతం శరీరం బరువు తాగించుకోగలిగితే దాని నుంచి తప్పించుకోవటం సాధ్యమే అంటున్నారు 40 నుంచి 69 ఏళ్ళ వయస్సు గల 867 మందిని ఐదేళ్ళ పాటు అధ్యయనం చేసి వారిని బరువు తగ్గే దిశగా మళ్ళించారు వీరిలో 257 మందిలో పూర్తి స్థాయిలో మధుమేహం తగ్గిపోయింది. మిగిలిన వారు కూడా బరువు తగ్గిన కొద్దీ షుగర్ నియంత్రణలో వుంచుకోగలగారని చెపుతున్నారు.

Leave a comment