Categories
ఉద్యోగం చేసే మహిళలకు వృత్తిపరమైన సంతృప్తి తో పాటు ఆర్థిక స్వేచ్ఛ మాత్రమేగాక వాళ్లలో మెరుగైన జ్ఞాపకశక్తి జీవిత చరమాంకంలో మెరుగ్గా ఉంటుందని పరిశోధనలు చెపుతున్నాయి. 1995-2016 మధ్య ఆరువేల మంది మహిళల జ్ఞాపకశక్తిని ప్రతి రెండేళ్లకూ పరీక్షించారు. దీనికోసం 16-50 మధ్య వయసువారిని ఎంపిక చేసుకున్నారు. పనిచేసే మహిళలతో పోలిస్తే పనిచేయని వారి జ్ఞాపకశక్తి సగటున 50 శాతం తక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేల్చారు. మహిళల జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండేందుకు వ్యాయామాలూ, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లతోపాటు ఉద్యోగం, వృత్తి కూడా కీలకమని ఈ అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి.మెదడుకు పదునుపెట్టే పని మొదలుపెడితే జ్ఞాపకశక్తి మెరుగవుతుందని ఈ అధ్యయనకారులు చెబుతున్నారు.