Categories
శరీరంలో రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటే రుగ్మతలు దూరంగా ఉంటాయి.ఈ విషయంలో కమలాలు తొలి వరుసలో ఉంటాయి.రోజు ఒక కమలా పండు తింటే గుండె మూత్రపిండాలు కాలేయం ఆరోగ్యంగా పనిచేస్తాయి.కమలా రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అధిక రక్తపోటు నియంత్రణ లో ఉంచుతాయి.కమలాఫలం రసంలో మిరియాల పొడి ఉప్పు కలుపుకొని తాగితే కొవ్వు కరగడంలో సహకరిస్తుంది.పండు యధాతధంగా తింటే జీర్ణ ప్రక్రియ శీఘ్రంగా సాగుతుంది. ఈ కమలారసం చర్మాన్ని మెరుపులు మెరిపిస్తుంది.