ప్రపంచంలో వింతలకు ,విడ్డురాలకు కొదవలేదు . ఎన్నో విచిత్రమైన కట్టడాలు ,నిర్మాణాలు చూస్తూనే అదే ఎంత గొప్పగా ఉన్నాయి అనిపిస్తూ ఉంటాయి . అలాటిదే రోలింగ్ వంతెన . లండన్ పాడింగ్ టన్ లో గ్రౌండ్ యూనియన్ కెనాల్ మీద ఉందీ వంతెన . కాలువలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఈ వంతెన ను చక్కగా పక్కకి మడిచేస్తారు . ఆలా చుట్టుకు పోతుంది కనుక దీన్ని కర్లింగ్ బ్రిడ్జ్ అని కూడా అంటారు . ఎనిమిది త్రికోణాకార సెక్షన్ల తో ఈ వంతెన అష్టభుజి ఆకారంలో రోల్ అవుతుంది . ఈ వంతెన నమూనా బ్రిటిష్ డిజైనరీ థామస్ హిధర్ లీక్ రూపొందించాడు 2004 లో ఈ బ్రిడ్జ్ ని నిర్మించారు .

Leave a comment