కెనడాలోని వాంకోవర్లో ఉంటుంది మిమి. ఆమెకు మేకప్ అంటే అమితమైన ఇష్టం.తన మొహన్ని కన్వాస్ గా మార్చుకుని మేకప్ కిట్ ను కుంచెగా చేసుకుని ఎన్నో చిత్ర విచిత్రాలు సృష్టిస్తుంది.మొహం పైన ఎన్నో కళ్ళుంటాయి. ఆరెంజ్ వలిచినట్లు మొహం పైన పొరలు,పొరల కింద నీడలు విస్మయపరుస్తాయి. చక్కని మొహన్ని ఎవరో చేతి వేళ్ళతో నొక్కేస్తుంటారు. ఒక మొహం పైన కళ్ళ వరసలు,పెదవుల వర్సలు ఈ సృజనకు హద్దులు లేవనిపిస్తుంది. ఈమె మేకప్ వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి చూడండి.

Leave a comment