ఐస్ క్యూబ్స్ కు కొన్ని పోషకాలు జోడిస్తే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చక్కని కాఫీ డికాషన్ ఐస్ క్యూబ్స్ ఫ్రిజ్ లో ఉంచి ప్రతి ఉదయం ఈ క్యూబ్ తో మొహం పై రుద్దితే ముఖం తాజాగా కాంతివంతంగా ఉంటుంది. అలాగే కీరదోస గుజ్జు తో ఐస్ క్యూబ్స్ తయారుచేసి ఆ క్యూబ్స్ తో ముఖం రుద్దితే ముఖం పొడి బారదు. గుప్పెడు తులసి ఆకులు కలబంద గుజ్జు ముద్దగా చేసి ఐస్ క్యూబ్స్ ట్రే లో నింపి ఫ్రీజర్ లో ఉంచాలి. దీనితో ప్రతి రాత్రి ముఖాన్ని మసాజ్ చేస్తే ఎండకు కమిలిన చర్మం మెరుపుతో ఉంటుంది.

Leave a comment