Categories
చర్మం ఆరోగ్యంగా ఉంటేనే మొహం చక్కగా కనిపిస్తుంది. చర్మం కాంతిగా తాజా,యవ్వనంగా అనిపించాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే మామిడి ,పుచ్చ,కమలా ,బొప్పాయి, కర్భూజా, కాప్సికం,టోమోటో ఆకు కూరలు తింటే సరిపోతుంది అంటున్నారు న్యూట్రిషనిష్టులు.ఈ వేసవి లో పలు సార్లు కాఫీ టీ లు తాగకుండా రెండు మూడు రకాల కూరలు,పండ్లు నీళ్ళు తీసుకోవాలి, నూనెలో వేయించిన చిరు తిండ్లు బేకర్ వస్తువులు తీసుకోకూడదు. కడుపు నిండా కాకుండా ఆకలి తీరే వరకూ ఆహరం తీసుకోవాలి. రోజుకు అరగంట వ్యాయామం చేస్తే బరువు నియంత్రణలోనూ ఉంటుంది. చర్మం కాంతివంతంగానూ ఉంటుంది.