మునగాకు తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు డైటీషియన్ లు అయితే ఆకు ప్రతిరోజు ఆహారంలో ఉండాలంటే కొన్ని సలహాలు ఇస్తున్నారు. తులసి, అల్లం, మిరియాల టీ తయారు చేస్తున్నారనుకోండి అందులో ఒక స్పూన్ మునగాకు వేస్తే రుచి లో తేడా రాదు అలాగే స్మూధీలు, మిల్క్ షేక్ లలో పాలు  అరటి పండ్లతో పాటు ఓ స్పూన్ మునగాకు కలుపుకోవచ్చు. పరోటాలు,రోటీలు తయారు చేసేందుకు సిద్ధం చేసే పిండిలో కూడా మునగాకు పొడి కాస్త కలుపుకుంటే మంచిదే. సూప్ లు, పప్పులు వండెప్పుడు కూడా మునగాకు పొడి కొంత కలుపుకుంటే మంచిదని ఇట్లా అన్ని రకాల ఆహారాల్లో ఓ స్పూన్ మునగాకు అలవాటు చేసుకోమని చెబుతున్నారు ఎక్సపర్ట్స్.

Leave a comment