Categories

ఫ్యాషన్ ఎన్ని మారినా ఎప్పటికీ వన్నె తరగని ట్రెండ్ ముత్యాల నగలదే. ఆఫీస్ దుస్తులకు కూడా సింపుల్ గా ఉండే,పెద్దగా మెరుపులు ఉండని ముత్యాల నగలు అందాన్ని ఇస్తాయి. ఇవి డార్క్ షేడ్స్ దుస్తుల పైన కూడా చక్కగా ఉంటాయి. అయితే ఒక్కటే విషయం వీటిని వేరే ఇతర ఆభరణాలలో స్టైలింగ్ చేస్తే అందం పోతుంది. అన్ని రకాల ఆభరణాలు ముత్యాలవే అయి ఉండాలి. గాజులు,చోకర్లు కూడా మొత్తం ముత్యాలతో డిజైన్ చేస్తున్నారు.