బరువు-నిద్రకు ,బరువుకు-ఆహారానికీ దగ్గర సంబంధం ఉందంటున్నారు ఎక్స్ పర్ట్స్. నిద్ర తగ్గితే శరీరం బరువు పెరగుతోంది. ఆరునుంచి ఎనిమిది గంటల నిద్ర ఉంటేనే శరీరం బురవు అదుపులో ఉంటుంది. అలాగే బరువు స్థిరంగా పెరగకుండా ఉండాలంటే ఇంట్లో చేసిన ఆహారం తినాలి. కొవ్వులు ,క్యాలరీలు,చక్కెర వంటివి జంక్ ఫుడ్ లోంచే వస్తాయి. ఇంట్లో చేసే వంటలో అవన్నీ పరిమితంగా ఉంటాయి. అలాగే తినే తిండి చక్కగా నమిలి తినాలి. తినేది బ్రేక్ ఫాస్ట్ అయినా రాత్రి భోజనం అయినా ఒకే రీతిగా అన్నీ ఒకే స్థాయిలో ఉండాలి. ఏదీ ఎక్కువగా తినే అలవాటు వద్దు. శరీరపు బరువు చూచుకొవటం చాలా అవసరం .బరువు పెరుగు తున్నట్లు అనిపిస్తే ఆహారం ,నిద్ర ,వ్యాయామం చెక్ చేసుకోవచ్చు.