మనవల్ల కాదు అన్న పదం చాలా సార్లు ఉపయోగిస్తాం. కానీ తలుచుకొంటే జరుగుతుంది  సోనమ్ కపూర్ లాగా.  టీనేజీలో సోనమ్ డయాబెటిస్ కారణంగా చాలా లావు ఉండేదట. తెరవెనుక ఉద్యోగాలే సరిపోతాయి అనుకొనేదట ఈ అనిల్ కపూర్ ముద్దుల కూతురు. సంజయ్ లీలాభన్సాలీ బ్లాక్ చిత్రానికి అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేసింది. ఆమె ఆలోచనలు మారాయి. ఏకంగా 30 కిలోల బరువు తగ్గి సావరియా చిత్రంలో హీరోయిన్ అయిపోయింది. రెండు నుంచి మూడు కోట్ల రూపాయల పారితోషికం అందుకొంటుంది. సంగీతం,కథక్, లాటిన్ డాన్స్ ఒకటేమిటీ అన్నింటిలోనూ నిష్ణాతురాలే. జాతీయ అవార్డు గ్రహీత, స్టైల్ ఐకాన్ .ఇటు భారతీయ వస్త్రధారణలోనూ ,అటు మోడల్ గా ఎలా అయినా బావుంటుంది .ఇప్పటికి ఏడు సార్లు కేన్స్ చిత్రోత్సవంలో రెడ్ కార్పెట్ పైన నడిచింది. అద్భుతమైన కాస్మోటిక్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ . నావల్ల కాదు అన్న పదం ఈమే దగ్గర లేదు.

Leave a comment