Categories
ఒక అధ్యయనం ప్రకారం సరికొత్త భారతదేశంలో కెరీర్ అవకాశాలు ఆడవాళ్ళకి చాలా విస్తృతం అవుతున్నాయి. కానీ అదే సమయంలో కుటుంబ సామాజిక అంచనాలు సంప్రదాయంలో వేళ్ళూకొని ఉన్నాయి. 25 నుంచి 55 సంవత్సరాల వయసు గల మహిళలు ఇటు కెరీర్ కు అటు సంప్రదాయాలు వదలని కుటుంబఆలోచనల మధ్య ఒత్తిడికి గురవుతున్నారు . ఎన్నో బాధ్యతలు కేరీర్ డిమాండ్స్ వాళ్ళని తీవ్రమైన ఇబ్బందిపెడుతున్నాయి. ఈ అధ్యయనంలో ప్రపంచంలో భారతీయ మహిళల అత్యంత అధికశాతం ఈ ఒత్తిడికి గురువుతున్నారని తేలింది. 82 శాతం మంది తాము రిలాక్స్ అయ్యేందుకు కూడా సమయం దోరకటం లేదనీ చెప్పారట..