Categories
వాతావారణంలో నిండిన కాలుష్యానికి దూరంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఆకాశహర్మ్యాలే శ్రేష్టం అంటున్నారు అధ్యాయనకారులు.ఇంతకు ముందు సాధరణంగా నేల కు దగ్గరగా ఉండాలని కింది అంతస్థులకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు వాహనాల కాలుష్యం శబ్దకాలుష్యానికి దూరంగా కనీసం ఇంట్లో ఉండే కాసేపైన ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నారు.గ్రౌండ్ ఫ్లోర్,ఫస్ట్ ఫ్లోర్లకు క్రమంగా ప్రాధన్యత తగ్గుతుంది.ముంబై,బెంగళూరు,నాగపూర్,చెన్నై,పూణెలలో 30,40 అంతస్థుల భవన నిర్మాణాల సంస్కృతి విస్తరించింది. పై అంతస్థుల్లో ఉంటే చక్కని గాలి,వెలుతురు వుంటుందని స్వచ్చమైన గాలితో అనారోగ్యాలు మటుమాయం అవుతాయని బహుళ అంతస్థులున్న అపార్ట్ మెంట్స్ లో నివసించే వాళ్ళు తమ అనుభవంగా చెభుతున్నారు.