Categories
ఫేస్ క్రీమ్స్, బ్యూటీ పార్లర్ సేవలు ఎల్లాగూ తీసుకుంటేనే వుంటారు. కానీ వాటి తో సమానమైన ఇంట్లో చేసుకునే సహజమైన చిట్కాలు కుడా వున్నాయి. జీడిపప్పు, కొబ్బరి పాలు చందనం తేనె కలిపిన ఫేస్ ప్యాక్ ఖరీదైన ఫేస్ ప్యాక్స్ కంటే బాగా పని చేస్తుంది. జీడి పాపు నానబెట్టి మెత్తని పేస్టులా రుబ్బేసుకుని ఇందులో ఓ స్పూన్ కొబ్బరి పాళీ పోయాలి. తర్వాత చందనం, తేనె కలిపితే చక్కని ఫేస్ ప్యాక్ తయ్యారవ్వుతుంది. మొహం సబ్బుతో కడిగి శుబ్రంగా తుడిచేసుకుని , ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇరవై నిమిషాల పాటు ఈ ఫేస్ ప్యాక్ అడనివ్వాలి. ఆ టైమ్లో చక్కని పాటలు వింటే ఇటు మనసుకి విశ్రాంతి తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో మొహం శుబ్రం చేసుకుంటే ముఖం పట్టులాంటి మృదుత్వంతో కాంతిగా వుంటుంది.