ఉద్యోగ విధిని ఉద్యమం లాగా మార్చిన ఆమె ఎంతో మందికి స్ఫూర్తి అన్నారు ప్రధాని మన్ కి బాత్ కార్యక్రమం లో పూనమ్ నొతియల్ ను పరిచయం చేశారు. ఉత్తరా ఖండ్ లోని భాగేశ్వర్ లో హెల్త్ వర్కర్ గా పనిచేసే పూనమ్ వ్యాక్సినేషన్ అనే మహా యజ్ఞంలో అత్యంత చురుకుగా పని చేసింది. రోజు పది పన్నెండు కిలోమీటర్లు కరోనా సమయం లోనే నడిచి వెళ్ళేది. చాలా మందికి వ్యాక్సిన్ పట్ల అవగాహన లేదు కానీ పూనమ్ వాళ్లకు తల్లిలాగా నచ్చజెప్పేది. వ్యాక్సిన్ తో ప్రాణాలు కాపాడుకోవచ్చు అని ఎంతో బ్రతిమలాడి మరి వ్యాక్సిన్ వేసేది. సహా ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేది. పూనమ్ నొతియల్ భావి తరాలకు స్ఫూర్తి.

Leave a comment