Categories
పుష్టికరమైన ఆహారం తీసుకొంటే దాని ప్రభావం మానసికంగా కూడా ఉటుందనేది అధ్యయనాలు నిర్దారించాయి . అయితే ఈ ప్రభావం ,పురుషుల్లో కంటే స్రీలపైనే ఎక్కువగా ఉంటుందని ఇటీవలి అధ్యయనాలు చెపుతున్నాయి . మగవాళ్ళ తక్కువ పోషకాలున్న ఆహారం తీసుకొన్నప్పటికీ ,మానసికంగా చురుగ్గ ఉన్నారని ,అదే ఆడవాళ్ళలో పోషకాహారం తగ్గితే మానసిక ఆరోగ్యము తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు . హార్మోన్స్ లో ఎక్కువ తక్కువలు ,పిల్లల్ని కనటం ,పెంచటంలో కలిగే అలసట పోషకాహారం తీసుకోవటంవల్లే పోతాయి . అందుకే మహిళలు తప్పని సరిగా పోషకాహారం తీసుకోవాలని నిపుణులు సిపార్స్ చేస్తున్నారు .