Categories
గంటల కొద్దీ చేసే ఆఫీస్ పనితో ఎన్నో శారీరక సమస్యలు వస్తుంటాయి.వర్క్ ఫ్రమ్ హోమ్ లో లాప్ టాప్ తో పనిచేసే చాలామందికి మణికట్టు నొప్పి వస్తుంది. అప్పుడు కుడి అరచేయి కింద భాగాన్ని ఎడమ చేతి వేళ్ళతో మృదువుగా కింద కు నొక్కాలి అలా కొన్ని సెకండ్ల పాటు ఒత్తితే ప్రయోజనం ఉంటుంది. అలాగే కుడి చేత్తో ఎడమచేతి కూడా స్ట్రెచ్ చేయాలి రెండు చేతులు ముందుకు చాచాలి కుడి చేతి వేళ్లను,ఎడమ చేతితో వెనక్కి మృదువుగా స్ట్రెచ్ చెయ్యాలి అలాగే ఎడమ చేతి వేళ్లను కుడి చేతి వేళ్ళ తో స్ట్రెచ్ చేయాలి. ఇలా నాలుగైదు సార్లు చేస్తే రిలాక్స్ అవుతాయి. ఎక్కువ సేపు కూర్చుంటే కాళ్లు తిమ్మిర్లు రాకుండా కాసేపు అటూ ఇటూ తిరగటం చిన్నపాటి వ్యాయామాలు చేయాలి .