మహారాష్ట్రలోని షిమార్ తాలుకా పింపుల్ ఖల్సా గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్లో చుట్టు పక్కల గ్రామాల పిల్లలు 350 మంది చదువుకుంటున్నారు.ఆ స్కూల్లో పని చేస్తుంది లలితా ధుమాల్ అనే టీచర్. ప్రతి సంవత్సరం ఉపకార వేతనాలు అందుకునేలా కొన్ని పరీక్షల కోసం పిల్లలని చదివిస్తూ అందరూ ఆ ఉపకార వేతనం అందుకునేలా చేసింది.ఈ ఫలితాల వల్ల చాలా మంది పిల్లల తల్లిదండ్రులకు పిల్లల చదువు భారం తప్పింది.అంత కృషీ చేసిన లలిత ధుమాల్ ను అభినందిస్తూ ఆ గ్రామస్థులు చందాలు వేసుకుని ఆమెకు కారు కొనిపెట్టారు కారులో ఆమె సుఖంగా ట్రావెల్ చేస్తూ ఇంకొంతమంది పిల్లల కోసం ఆమె చక్కగా పని చేయాలని గ్రామస్థులు కోరుకున్నారు.