Categories
మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లా లోని కోరేగావ్ గ్రామ సర్పంచ్ మినా బిసెన్ చాలా ప్రత్యేకం ఈమె గ్రామ అభివృద్ధి పనుల తో పాటు గ్రామంలోని పిల్లలకు పాఠాలు చెపుతారు మీనా. ఇంగ్లీష్ సోషల్ వర్క్ ల్లో ఎం ఎ బియిడి కంప్యూటర్ అప్లికేషన్స్ లో పిజి డిప్లమో చేసి 16 ఏళ్ళు టీచర్ గా పని చేశారు.2022 లో కోరేగావ్ సర్పంచ్ గా గెలిచారు. ఉద్యోగం వదిలేసి సర్పంచ్ బాధ్యత తీసుకున్న టీచింగ్ వదిలిపెట్టలేదు అందుకే గ్రామంలోని 70 మంది పిల్లలకు ఉచితంగా ఇంగ్లీష్ బోధిస్తారు మీనా.