Categories
ముఖం తాజాగా జిడ్డు లేకుండా ఉంచుకునేందుకు ఫేస్ వైప్స్ ఉపయోగిస్తారు.వీటిని పర్ ఫ్యూమ్ గా డియోడరెంట్ గా కూడా వాడవచ్చు.ఎండలో బయటకు వస్తే చెమట పట్టి వాసన వస్తుంది అప్పుడు ఫేస్ వైప్స్ తో చెమట పట్టిన చోట తుడుచుకుంటే వాసన పోతుంది.మేకప్ రిమూవర్స్ తో కళ్ల దగ్గర మేకప్ తొలగించేందుకు ఎక్కువ శ్రమ సమయం పడతాయి.ఫేస్ వైప్స్ రుద్దితే మేకప్ తొందరగా వదులుతోంది.సున్నితమైన చర్మం గలవారు వ్యాయామం తర్వాత పట్టిన చెమటను ఫేస్ వైప్స్ తుడుచుకోవచ్చు.దాంతో స్వేదగ్రంథులు తెరచుకుని చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.హ్యాండ్ బ్యాగ్ లో తప్పనిసరిగా ఉంచుకోవలసిన వస్తువుల్లో ఇవి చాలా ముఖ్యం కూడా.