అస్తమానం సెల్ఫీలు తీసుకోవటం,సోషల్ మీడియాలో పోస్ట్ చేసి,లైకులు కోసం చూడటం అమ్మాయిల హాబీల్లో ఒకటి మరి ఫోటోల్లో పర్ ఫెక్ట్ గా కనిపించాలి అంటే చిన్న కిటుకులు పాటించాలి. ఫోటో జెనిక్ గా ఉండటం కూడా నేర్చుకొని సాధించవలసిన విషయాలే ఫోటోకి ఫోజ్ ఇవ్వాలంటే చర్మ పరి రక్షణ చాలా అవసరం. కెమెరా ప్రతి చిన్న అంశాన్ని పవర్ ఫుల్ గా పాటిస్తుంది. చర్మం ముదువుగా కనిపించేలా కాస్తయినా శ్రద్ధ తీసుకోవాలి. సింపుల్ మేకప్ చాలా అవసరం . కొన్ని రంగు దుస్తులు కెమెరా షేడ్ అవుతాయి చర్మం కాంతికి సరిగ్గా సూటయ్యే దుస్తులు వేసుకోవాలి . అవి సరిగ్గ ఫిట్ గా ఉండాలి ఆత్మవిశ్వాసం మనిషికి ఎనలేని అందాన్ని హుందాతనాన్ని ఇస్తుంది అలాగే మనసులో భావోద్వేగాలు దాచుకోవచ్చు . నవ్వొస్తే హాయిగా నవ్వాల . చిన్న చిరునవ్వు,స్వేచ్ఛగా నవ్వవే ఫోటోకి జీవం ఇస్తుంది. ఒక సెల్ఫీ తీసుకొంటూవుంటే మరీ మొహాన్ని ఫోకస్ చేయద్దు. శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని సౌకర్యంగా ఉంచుకొంటూ ఫోజ్ ఇస్తే బావుంటుంది.

Leave a comment