Categories
ఆఫీస్ లో నిద్రపోతే ఉద్యోగాలు పోతాయని విన్నం కానీ,మీరు హాయిగా నిద్రపోయి చూపించండి లక్ష రూపాయిల జీతం ఇస్తాం అనటం ఎక్కడైనా విన్నారా?బెంగుళూరు లోని పరుపుల తయారీ సంస్థ వేక్ ఫిట్ కంటినిండా నిద్రపోతే డబ్బు ఇస్తానంటోంది . ఆఫీస్ కు కూడా పోకుండా ఇంట్లోనే తొమ్మిది గంటల పాటు కంటినిండా నిద్రపోవాలి . అయితే నిద్రపోయినట్లు వీడియో సాక్ష్యం ఉండాలి . వేక్ ఫిట్ సంస్థ తను ప్రచారంలో భాగంగా ఈ స్లీప్ ఇంటెర్నెషిప్ ప్రకటించింది . పరుపు దిండ్లు వాళ్ళ ఇస్తారు . దేశవ్యాప్తంగా ఎవరైనా ఈ ఇంటెర్నెషిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు . నిద్రపోయి నెలకు లక్ష సంపాదించుకోవచ్చు .