Categories
కాస్త పొడుగ్గ కనిపించాలి అనుకుంటే ఆహార్యంలో చిన్న మార్పులు చేసుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కుర్తీలు ధరించేవాళ్ళు దాని పొడవు మోకాళ్ళు దాటి ఉండేలా చూసుకోవాలి. వీటికి గుండ్రని హృదయకృతిలో ఉండేవి.ఇంగ్లీష్ యు ఆకారంలో ఉండే మెడ డిజైన్ లు సూట్వుతాయి. అలాగే సన్నగా తక్కువ ఎంబ్రాయిడరీ వుండే వాటిని ఎంచుకోవాలి. షిఫాన్, జార్జెట్ ,నూలు మేళవించిన వస్త్రాలు బావుంటాయి.దుస్తులు శరీరానికి అతికినట్లు ఉండాలి. ఎత్తు తక్కువ వారికి స్లిమ్ ఫిట్ జీన్స్ పలాజోలు బావుంటాయి.ఎత్తు చెప్పులు వేసుకోవాలి యాక్సెసరీలు మాత్రం చాలా తక్కువ ఉంటే చాలు పొడుగ్గా చక్కగా కనిపిస్తారు.