Categories
మహిళలు కొన్ని రంగాల్లో ఇప్పటికీ వివక్ష ఎదురుక్కోంటూనే ఉన్నారు అంటుంది యునెస్కో నివేదిక. ముఖ్యంగా పరిశోధన రంగంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెబుతోంది. ఇందులో మహిళలు తక్కువే కాదు, మహిళా పరిశోధకులకు అందే వేతనం ,పదోన్నతుల శాతం తక్కువే అని ప్రస్తావించింది నివేదిక. జాతీయ సైన్స్ విద్యాసంస్థల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు.ముఖ్యంగా సైన్స్ విభాగాల్లో 40 శాతం ఇంజినీరింగ్ రంగం లో 20 శాతం మాత్రమే మహిళలు పట్టభద్రులు గా ఉన్నారు. ఈ సంఖ్య మరింతగా పెరిగి అమ్మాయిలు డిజిటల్ ఎకనామిక్స్ లో పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వాములు అయితేనే సాధికారత సాధ్యం అంటోంది యునెస్కో నివేదిక.