Categories
చేతుల్లో బాక్టీరియా ఉంటుందని, కాబట్టి శుబ్రంగా చేసుకోవాలని చెప్పుతుంటారు కానీ అదే పనిగా యాంటీ బాక్టీరియల్ సోప్స్ లిక్విడ్స్ తో కదిగేస్తూవుంటే పాలిచ్చే తల్లులకు గర్భీణీలకు ఎంతో హాని జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడొచ్చిన ఒక రిపోర్టు ప్రకారం ఈ సబ్బులు, లిక్విడ్స్ తయ్యరీ లో ఉపయోగించే రసాయినాలు హార్మోన్ లను ప్రభావితం చేస్తాయని వీటి వల్ల నష్టమే ఎక్కువ అంటున్నారు. వ్యాధుల నివారణ, ఇన్ ఫెక్షన్ల నిరోధంలో సాధారణ సబ్బుల కంటే ఇవి ఎక్కువగా ప్రభావం చూపెడతాయని అంచేత సాధారణమైన సబ్బులు తేలిక పాటి లిక్విడ్ తో చేతులు కడుక్కోవడం మంచిదంటున్నారు.