Categories
ఏ చిన్న వేడుక కైనా కేక్ కట్ చేయడం అలవాటై పోయింది. అయితే ఏదో ఒక ప్రత్యేకత లేకపోతే కేక్ మటుకు ఏం బావుంటుందీ . పిల్లల్ని ,పెద్దల్ని అలరించేందుకు గానూ వస్తున్నాయి షుగర్ ప్లవర్ కేకులు. కేక్ పైన అలంకరించే పువ్వులు ఎంత అందంగా ఉంటున్నాయంటే అచ్చంగా ఇప్పుడే కొమ్మ నుంచి కాసిన గులాబీలు ,మందారాలు, చామంతులు,లిల్లీల్లాగే ఉంటున్నాయి. ఆకులు కాడలు పూవ్వులు కనిపించే కేశాలు పుప్పొడి పొడితో సహా అచ్చమైన పువ్వుల్లా ఉండే వీటిని పంచదారతో తయారు చేస్తున్నారు. పంచదార పొడి ,వెజిటబుల్ గమ్ కలిపి తయారు చేసే ఎడిబుల్ గామ్ ,పేస్ట్ ని చపాతీల్లా కత్తిరిస్తారు .రకారకాల పువ్వుల మెల్ట్ లు మార్కెట్ లో దొరుకుతున్నాయి.