కోయంబత్తురు కు చెందిన స్వర్ణ ఫౌండేషన్ ,దేశ వ్యాప్తంగా సూపర్ ఉమన్ ను ఎంపిక చేసి కాలండర్ రుపొందిస్తుంది. వారి చిత్రాలతో రూపొందించే ఈ కాలండర్ లో ఈ సంవత్సరం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన మాధవిలతను ఎంపిక చేసింది. క్రీడాకారిణిగా పారా ఒలంపిక్స్ లో పతకాలు గెల్చుకున్న మాధవిలత ఉద్యోగినిగా స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ లో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఎదిగింది. పోలియోలో చిన్నప్పుడే రెండు కాళ్ళు చచ్చుబడిన మాధవిలత స్విమ్మింగ్ లో నైపుణ్యం సాధించింది. పారా ఒలంపిక్ స్వమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరుపున మహారాష్ట్డలోని కొల్హాపూర్ లో 2011లో 3 బంగారు పథకాలు సాధించింది. 50 మీటర్ల ఫ్రీ స్టైల్ ,బ్యాక్ స్ట్రోక్ ,బటర్ ఫ్లై విభాగల్లో నేషనల్ ఛాంపియన్ గా ఉంది. 2011లో వీల్ చైర్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ నెలకొల్పి దివ్యాంగులకు శిక్షణ ఇస్తుంది.
Categories