![](https://vanithavani.com/wp-content/uploads/2021/07/inside-sunrise-pink-and-blue.jpg)
చందమామ కథల్లో హంసల దీవి గురించి చదివే వుంటారు. చల్లని తేట నీటి సరస్సులు అందులో హాయిగా ఈదే రాజ హంసలు తలచు కొంటేనే బావుంటుంది. మరి ఈ రోజుల్లో అలాటి దీవులు,హంసలూ ఉంటాయా ? అంత అందమైన ప్రదేశం మనం చూడగలమా అంటే అవును చూడచ్చు అంటారు. సైబీరియా సమీపం లో యురోజహైనీ గ్రామస్థులు. ఈ హంసలు 1967 నుంచి మా ఊరికి వలస వస్తున్నాయి అంటారు.ఈ సరస్సు రష్యాలో ఉంటుంది. నిజంగా ఈ సరస్సే ఒక వింత. బయట వాతావరణం మైనస్ డిగ్రీల్లో ఉన్న ఈ సరస్సు లో నీరు గడ్డకట్టదు. వేడిగా ఉంటుంది. ఈ ప్రత్యేకత కారణంగా వందలాది హంసలు శీతాకాలంలో ఇక్కడకు వలస వస్తాయి .ఈ సరస్సు నీరు చాలా తేటగా మురికి లేకుండా ఉంటుంది.అందుకే దీన్ని క్లియర్ లేక్. లేదా స్వెట్లోయ్ లేక్ అని పిలుస్తారు. శీతాకాలం ప్రారంభం కాగానే హంసలు గుంపులు సైబీరియా కు తరలి వస్తాయి. బయట ఉష్ణోగ్రత మైనస్ 40 డిగ్రీలకు పడిపోతున్నా సరస్సు 5,6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది .ఈ అద్భుతమైన అందాల హంసల సరస్సు పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తూనే ఉంది.