Categories
కవిత భర్త రాజీవ్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తుంటాడు ఇంట్లో మామగారు పక్షవాతంతో అన్ని పడక పైనే మాట్లాడలేడు. ఏదన్న కావాలంటే స్పూన్ తో మంచం పక్కన కొట్టి అడుగుతాడు. కవిత ఇంట్లో పనులతో పాటు ఇంట్లో ఉండి చేయగల మార్కెటింగ్ చేస్తుంది. పక్షవాతంతో ఉన్న మామ నిరంతరం ఏదో అవసరం కోసం స్పూన్ తో టక్కు టక్కు మనీ కొడుతూ పిలుస్తూ ఉంటాడు. చేతిలో పని వదిలేసి వచ్చేవరకు స్పూన్ మోత తప్పదు. ముఖ్యమైన బిజినెస్ డిస్కషన్ లో ఉన్న సమయంలో స్పూన్ తో వదలకుండా పిలిచే మామ పైన కోపం తో క్షణికావేశంతో అక్కడున్న దిండుతో అతన్ని చంపేస్తుంది కవిత. భరించలేని దుఖం తో ఉంటుంది కవిత. మామ అంతక్రియలు అయిపోతాయి వంటింట్లో పని లో ఉంటుంది కవిత మళ్లీ స్పూన్ శబ్దం. హాల్లోకి వచ్చి చూసేసరికి భర్త కాఫీ తాగేసి సాసర్ పైన స్పూన్ తో కొడుతూ ఉంటాడు. ఆమెకు జీవితం మొత్తం ఈ శబ్దం వినక తప్పదు అనిపిస్తుంది.ఆడవాళ్ళ పైన ఉండే అంతులేని బాధ్యత పెద్ద వాళ్ళని చూసుకోవటం ఇంట్లో చాకిరి, అన్ని కలసిన భారం ఈ టీస్పూన్ తప్పనిసరిగా చూడండి.
రవిచంద్ర సి
7093440630