Categories
అందాల ఉత్పత్తులను సాధారణంగా అయ్యిపోయే వరకు వాడుతూ ఉంటారు . మధ్యలో గ్యాప్ వచ్చిన తిరిగి అవసరం వచ్చినపుడల్లా వాడటం పరిపాటి . కానీ వాటిలో కొంత కాలానికి ప్రిజర్వేటిక్స్ ప్రభావం తగ్గిపోతుంది . లోపల మైక్రోబ్స్ పెరుగుతాయి . వాటి వల్ల రాష్ ,మొటిమలు,అలర్జీ లు వస్తాయి . సాధారణంగా నీటి ఆధారిత ఫాండేషన్లు ఏడాది దాకా ,నూనె ఆధారిత ఫాండేషన్లు 18 నెలల దాకా ఉంటాయి . కాన్సిలర్లు ,పేస్ పౌడర్ ,పౌడర్ బ్రెష్ ఆన్స్ ,పౌడర్ ,ఐషాడో రెండుమూడు వాడుకోవచ్చు . ప్రతి ఆరునెలలకు మస్కారా మార్చాలి . స్కిన్ క్లన్సర్లు ,టోనర్లు, మాయిశ్చరైజర్లు 6 నుండి 12 నెలల దాకా నిల్వ ఉంటాయి . ఎక్కువ ఆల్కహాలిక్ పదార్దాలు ఉంటే హెయిర్ స్టయిలింగ్ ఉత్పత్తులు అంత త్వరగా పడవవు .