దక్షిణ కొరియాలో ఆస్కార్ అవార్డ్ తో సమానమైన గ్రాండ్ వెల్ అవార్డు పొందిందీ సినిమా. ఒక తల్లీ ఉద్యోగం వెతుక్కోవడం కోసం తన పదేళ్ళ కొడుకు సాంగ్ వూ ని కొన్నాళ్లపాటు అమ్మమ్మ దగ్గర వదిలి పెట్టవలసి వస్తుంది.సియోల్ లో పుట్టి పెరిగిన సాంగ్ కి నడుము వంగిపోయిన అమ్మమ్మ ఆమె ఉండే పల్లెటూరు నచ్చవు పైగా మాట్లాడలేని మూగ మనిషి అమ్మమ్మ ఆమెతో అసలు మాట్లాడడు సాంగ్. కానీ అమ్మమ్మ పిల్లవాడి కోసం ఎంతో కష్టపడుతుంది.  పైసా చేతులు లేని వంగిపోయి నడుస్తూ మనవడి కోసం పెరట్లో పండించే  కూరలు అమ్మి అన్నీ సమకూరుస్తోంది అలా పట్నం తీసుకుపోయి తను అడిగినవన్నీ కొని , బస్సు ఎక్కించి, డబ్బు లేక ఈడ్చుకుంటూ  నడిచి వచ్చిన మా అమ్మ ప్రేమను గుర్తిస్తాడు సాంగ్. తీరా తల్లి వచ్చే వేళకు ఆ పిల్ల వాడికి అమ్మమ్మ ను వదిలి వెళ్ళాలంటే మనసు రాదు. ఎంతో దిగులుతో గుండె నిండా దుక్కం తో ఆమెను వదిలి వెళ్ళిపోతాడు. సినిమా అద్భుతంగా ఉంది యూట్యూబ్ లో  సబ్ టైటిల్స్ తో  తప్పకుండా చూడవలసిన చిత్రం

రవిచంద్ర. సి 
7093440630

Leave a comment