శరీరంలో ఈ నాలుగు హార్మోన్స్ ఉంటేనే ఉత్సాహంగా ఉంటుంది. ఈ హార్మోన్లు చురుగ్గా ఉంచే బాధ్యత కూడా మనదే. మనసు సంతోషాన్ని నిచ్చే హార్మోన్ పేరు డోపమైన్. మనల్ని మనం సంతోషపెట్టుకుంటేనే ఈ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హ్యాపీ హార్మోన్ కోసం ఏదైనా సెల్ఫ్ కేర్ యాక్టివిటీ లో పాల్గొనాలి ఇక భావోద్వేగాలను అదుపులో పెట్టే  సెరోటోనిన్ ఉత్పత్తి కోసం, ధ్యానం చేయాలి, వ్యాయామం, ఎండలో నడవడం చేయాలి. నొప్పి నివారణ ఎండార్షన్ ఉత్పత్తి కోసం గట్టిగా నవ్వాలి డార్క్ చాక్లెట్స్ తినాలి వ్యాయామం చేయాలి. లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్ కోసం నచ్చిన వాళ్ళను సంతోష పెట్టాలి. కుటుంబ సభ్యులను హత్తుకోవాలి. పెంపుడు జంతువులతో ఆడాలి. మనస్పూర్తిగా ఇతరులను ప్రేమించాలి.

Leave a comment