Categories

చర్మ సోయగాన్ని దెబ్బతీస్తోంది కాలుష్యం. చర్మం రంగు మారటం మచ్చలు రావటం వయసు పైబడ్డట్టు కనిపించటం ఇవన్నీ కారణాలే బయటికి అడుగు పెడితే ముందు సన్ స్క్రీన్ రాసుకోవాలి తలచుట్టూ స్కార్ఫ్, లేదా దుపట్టా కప్పుకోవాలి గొడుగు వెంట తీసుకుపోవాలి. రాత్రి నిద్రపోయే ముందర వంటికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.కనీసం రాత్రి వేళ అయినా కుంకుడు కాయల పొడి శెనగపిండి పసుపు కలిపిన మిశ్రమంతో బళ్ళు రుద్దుకోవాలి. ప్రతిసారి బయట నుంచి ఇంటికి వచ్చాక వేడి నీళ్ళు స్క్రబ్బర్ తో మొహం కడుక్కోవాలి కాలుష్యం కారణంగా ఏర్పడే మురికి వదిలించుకునే మార్గం ఇదే.డైటీషియన్ సలహాతో వంట్లోని విషపదార్థాలను బయటికి పంపగలిగే పోషకాహారం తీసుకోవాలి దీనితో చర్మం నిగారింపు తో మెత్తగా శుభ్రంగా ఉంటుంది.