Categories
వంకాయవంటి అద్భుతమైన రుచిగల కూరలేదు అన్నారు కవిగారు . నిఫుణులు కూడా వంకాయను ఆహారంలో ఎక్కువగా ఉపయోగించమనే చెపుతున్నారు. వంకాయ తొక్కలో ఉండే యాంథోసియానిమ్స్ యాంటి ఆక్సిడెంట్స్ కేన్సర్ కణాలకు వ్యతిరేఖంగా పోరాడుతాయి. శరీరంలో నారాల బలహీణత తగ్గిస్తాయని డైటీషియన్లు చెపుతున్నారు. ముఖ్యంగా డయాబెటీస్ తో బాధ పడేవాళ్ళకు వంకాయను ఎంత ఎక్కువ తింటే అంత మంచిది అని చెపుతున్నారు. వీటిలో తక్కువ మోతాదులో గ్లిజమిక్ ఇండెక్స్ ఉంది. దీనివల్ల వంకాయను ఎంత తీసుకున్న ఆరోగ్యం విషయంలో నిశ్చితంగా ఉండవచ్చు అంటున్నారు.