Categories
యాభయ్యో ఏటా భరతనాట్యం అరంగేట్రం చేశారు లలిత ఆనంద్. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్ భార్య. నచ్చిన పని చేసేందుకు వయసు అడ్డురాదని నిరూపించారామె. ఐ ఎస్ బి రీసెర్చ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఫైనాన్స్ పాఠాలు చెప్పారు.డయాబెటిస్ బారిన పడ్డాక నృత్యం వైపు దృష్టి పెట్టారామె అలాగే టెయిల్విండ్ టేల్స్ అనే పుస్తకం రాశారు. టీనేజర్ల కోసం రాసిన ఈ పుస్తకం బాగా అమ్ముడుపోయింది. జీవితానికి ప్రణాళికలు ఉండవు. నచ్చినట్లుగా జీవించాలి తప్పకుండా ఇష్టమైన వ్యాపకం ఒకటి ఉండాలి అదే మనకు తోడుగా ఉంటుంది అంటారు లలిత ఆనంద్.