అన్నీ మరచిపోతున్నామని ఊరికే భయపడతాం కానీ, కొంచెం కష్టపడితే జ్ఞాపకాన్ని పదిలంగా మరుపనేది రాకుండా దాచుకోవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. అడిగీ అడగ్గానే ఫోన్ నంబర్లు, నిమిషాలతో ఎప్పుడో జరిగిన విషయాలు ఏకరువు పెట్టేవాళ్ళని చూస్తుంటాం. వీళ్ళందరికీ సాధ్యం అయింది మనకీ సాధ్యం అవుతుంది. కాస్త ఎక్సర్సైజులు చేయాలి. ముందుగ మరచుపోతున్నానన్న భయం పోగొట్టుకోవాలి. కొన్నాళ్ళ పాటు దీక్షగా ప్రతి విషయానికి విజువల్ మెమొరీని యాడ్ చేస్తూ రావాలి. ఉదాహరణకు బయటకు వెళ్లివచ్చి బ్యాగ్ టేబుల్ పైన పెట్టాం.మరచిపోతున్నామని తెలుసు కనుక వస్తూ వస్తూ ఆ బ్యాగ్ దగ్గరలోని అద్దం చూస్తూ బ్యాగ్ ని అద్దంలోకి చూడతమో లేదా బ్యాగ్ పైన ఉన్న అక్షరాలను అద్దంలో చదవడమో చేయాలి. బ్రెయిన్ లో ఈ విజువల్ రికార్డు చేసుకొంటున్నమన్నమాట. మనం బ్యాగ్ అనుకోగానే ఈ దృశ్యం గుర్తుకు వస్తుంది. అస్తమానం ఈ తద్దినం ఏమిటి అనుకోవద్దు. కొన్నాళ్ళు మన బ్రెయిన్ లో మాయమైపోతున్న మెమొరీ పవర్ ను తిరిగి తెచ్చుకోవాలి కదా. మరచిపోకూడదు అనుకునే నంబర్లకు రంగు రూపు ఊహించుకోవడం లాంటి ట్రిక్స్ మనమే ఎక్స్పరిమెంట్స్ చేయాలి.
Categories