చామంతి పూలు పూజకు అలంకరణకే కాదు చర్మ కేశ సంరక్షణకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. నాలుగైదు చామంతి పూలను,నాలుగు తమలపాకులతో కలిసి నీళ్లలో వేసి మరిగించాలి. ఆ నీళ్లు కాచి చల్లార్చి తేనె కలిపి మొహానికి పూతగా రాయాలి ఇలా తరచూ చేస్తే ముఖం పై మచ్చలు పోతాయి చామంతి టీ లో కాస్త గులాబి నీరు రెండు చుక్కల లావెండర్ ఆయిల్ కలిపి మొహానికి రాసుకుంటే టాన్ పోయి మొహం శుభ్రంగా ఉంటుంది.ఒక కప్పు చామంతి టీ లో,మెంతి పిండి పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని ఆరనిచ్చి తలస్నానం చేస్తే జుట్టు పట్టులా తయారవుతుంది.

Leave a comment