కలరిపయట్టు రెండువేల ఏళ్లనాటి యుద్ధ విద్య జూడో, కరాటే వంటి వాటికి మూలం ఇదే. ఏ ఆయుధం లేకుండా ప్రత్యర్థిని ఎదుర్కోవటం ప్రధానమైన అంశం మహిళలకు భద్రత నానాటికి ప్రశ్నార్ధకంగా మారుతున్న ఈ కాలంలో ప్రతి అమ్మాయి ఆత్మ రక్షణ కోసం కలరిపయట్టు నేర్చుకోవాలి అంటోంది మీనాక్షి అమ్మ.దేశంలోనే అత్యంత వయోధికురాలైన యుద్ధకళ గురువు గా పేరుపొందిన మీనాక్షి అమ్మ కు 2017 లో పద్మశ్రీ లభించింది. యుద్ధ కళలను ప్రభుత్వాలు పాఠ్యాంశాలుగా  ప్రవేశ పెట్టి పిల్లలకు నేర్పించాలన్నది నా ఆకాంక్ష అంటోంది మీనాక్షి అమ్మ.ఆమె చెబుతున్న మాటల్లో కాస్తయినా అతిశయోక్తిలేదు అమ్మాయిలు తప్పని సరిగా యుద్ధ విద్యలు నేర్చుకుంటే మనుగడ అవి ప్రస్తుత పరిస్థితులు నిరూపిస్తున్నాయి.  

Leave a comment